మాజీ ప్రభుత్వ విప్ ను పరమర్శించిన బిఆర్ఎస్ నాయకులు 

మాజీ ప్రభుత్వ విప్ ను పరమర్శించిన బిఆర్ఎస్ నాయకులు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 13 (అఖండ భూమి న్యూస్)

ఇటీవల బిఆర్ఎస్ భవన్ వద్ద తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ ప్రభుత్వ విప్ కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ ని శుక్రవారం హైదరాబాద్ లోని తన నివాసంలో కామారెడ్డి టిఆర్ఎస్ నాయకులు కలిసి పరమర్శించారు. ఆయన అనారోగ్యంతో ఆస్పత్రి చికిత్స పొంది తన నివాసానికి వచ్చిన అనంతరం వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ అధికార ప్రతినిధి గైని శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు గెరిగంటి లక్ష్మినారాయణ, మాసుల లక్ష్మినారాయణ, సంగి మోహన్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లద్దూరి కృష్ణ యాదవ్, పట్టణ యువత అధ్యక్షుడు చెలిమెల భానుప్రసాద్ తదితరులు పరమర్శించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!