15 న దోమకొండలో సమూహిక అక్షరభ్యాస మహోత్సవం.

15 న దోమకొండలో సమూహిక అక్షరభ్యాస మహోత్సవం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 13 (అఖండ భూమి న్యూస్)

సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం దోమకొండ గ్రామం , పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా 15-జూన్ ఆదివారం రోజున దోమకొండ గడికోట నందు సామూహిక అక్షరాభ్యాస మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామనీ దోమకొండ గడికోట, గ్రామీణ అభివృద్ధి స్వచ్ఛంద సంస్థ అధికారి బాబ్జి, నేతుల గణేష్ లు తెలిపారు.

. వేద పండితుల సమక్షంలో సరస్వతి పూజ అనంతరము చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది. అక్షరాభ్యాసానికి కావలసినటువంటి పూజా సామాగ్రిని పలకలను చిన్నారులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందనీ తెలిపారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని వారి యొక్క బంగారు భవిష్యత్తుకు తోడ్పడు అందించాలని అన్నారు.ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొనదలచిన చిన్నారుల యొక్క తల్లిదండ్రులు సంప్రదించవలసిన నెంబర్ 9493143378,9441957951,9948137616 సెల్ నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించగలరు.

Akhand Bhoomi News

error: Content is protected !!