మోడీ నిర్ణయం ట్రిపుల్ తలాక్ , వక్ఫ్ బోర్డు సవరణ , ఆర్టికల్ 370 రద్దు బీజేపీ విజయాలు…

మోడీ నిర్ణయం ట్రిపుల్ తలాక్ , వక్ఫ్ బోర్డు సవరణ , ఆర్టికల్ 370 రద్దు బీజేపీ విజయాలు…

రక్షణ వ్యవస్థ కట్టుదిట్టం చేయడంలో మోదీ ప్రభుత్వం సఫలం అయ్యింది.

కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 14 (అఖండ భూమి న్యూస్)

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో గత 11 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై *పోటో ప్రదర్శన(ఎగ్జిభిషణ్) ఏర్పాటు చేయడం జరిగింది.

 

ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఈ ప్రదర్శన నని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు సాధించిన విజయాలపై ముద్రించిన కరపత్రాన్ని విడుదల చేయటం జరిగింది.

అనంతరం *వికసిత భారత్ – 2047* లక్ష్యంపై బిజెపి కార్యకర్తలు ప్రతిజ్ఞ చేయటం జరిగింది.

 

ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకొని నాయకుడు మోదీ అని నిరంతరం దేశ అభివృద్ధికి పాటు పడుతున్న వ్యక్తి అని అన్నారు. అన్నదాతలకు అండగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలు నరేంద్ర మోదీ సొంతం అని అన్నారు. రక్షణ వ్యవస్థ కట్టుదిట్టం చేయడంలో మోదీ ప్రభుత్వం సఫలం అయ్యిందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, ప్రధాన కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు వీపుల్, పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ నరేందర్, శ్రీనివాస్ నాయకులు సురేష్, వేణు, సంతోష్ రెడ్డి, రవీందర్, రాజు, విటల్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!