ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 12 (అఖండ భూమి న్యూస్);
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన గుణాత్మక విద్య అందిస్తున్నామని తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో జరిగిన పేరెంట్స్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు
ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం, రెండు జతల యూనిఫారం లు, పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు అందిస్తున్నామని ఆయన తెలియజేశారు. దాతల సహకారం తో పాఠశాలలో రంగులు వేయించడం పూర్తి చేయడం జరిగిందని, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు యూనిఫామ్స్ పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లారెడ్డి ,మండల స్పెషల్ ఆఫీసర్, మండల విద్యాధికారి యోసేఫ్ , జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి వేణుగోపాల్, వయోజన విద్య ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర రావు ,గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
ఇదే గ్రామం లోని ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల లలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు విద్యార్థులకు ఉచిత యూనిఫారం , పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



