బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డును గెలుచుకున్న కామారెడ్డి జిల్లా కలెక్టర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 14 (అఖండ భూమి న్యూస్)
హైదరాబాదులోని రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ & ప్రెసిడెంట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ స్టేట్ చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఎంతో ప్రతిష్టాత్మకమైన బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు శనివారం అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు మాత్రమే ఈ అవార్డు రావడం గమనార్హం. గత సంవత్సరంనుండి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులుగా చేసిన సేవలకు గాను ముఖ్యంగా జిల్లాలో ఎక్కువ సంఖ్యలో రక్తదాన శిబిరాలు ప్రభుత్వపరంగా నిర్వహించడం వలన ఈ ప్రత్యేక అవార్డు పొందడం జరిగింది. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ ఎం రాజన్నతో కలిసి జిల్లా అధికారులు అందరితో రక్తదాన విషయంలో సమీక్ష జరిపేవారు. ప్రతి జిల్లా అధికారులు వారి సిబ్బంది తప్పక రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని మోటివేట్ చేయడం మూలంగా ప్రతి నెల రెండు ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది విరివిగా రక్తదానం చేసేవారు. ఇలా సేకరించిన రక్త యూనిట్లను జిల్లాలోని పేద ప్రజల ఆరోగ్య అవసరాల కొరకు వినియోగించేవారు. అవార్డును స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట్యా విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించి ప్రజల ఆరోగ్య అవసరాల నిమిత్తం అందించినందుకు చేసిన కృషికిగాను గవర్నర్ అవార్డు రావడం గర్వకారణమని, జిల్లా కలెక్టర్ గా మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులుగా ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, రక్తాన్ని స్వీకరించడంలో తనతో పాటు కృషిచేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్న, వైస్ చైర్మన్ నాగరాజు గౌడ్, స్టేట్ ఎంసీ మెంబర్ సంజీవరెడ్డి, ఐఆర్సిఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా అధికారులు, జిల్లా ప్రజలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకముందు కూడా ఈ సేవలను కొనసాగిస్తామని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.
You may also like
23, 27 తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..?
తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు పై తేల్చేసిన కేంద్రం…..2029 ఎలక్షన్ కి లేనట్టే..!
డయాబెటిక్ రోగులకు గొప్ప శుభవార్త… భారత్లోకి వచ్చేసిన బరువు తగ్గించే ఒజెంపిక్ ఇంజెక్షన్.. నెల రోజుల డోసు ప్రారంభ ధర ఎంతంటే..!*
కోడేకల్ లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తుంది సర్పంచ్ రాజేష్ వారు గౌడ్ లక్ష్మి
పంచాయితీ స్థాయిలోనే సమర్థవంతమైన పాలనే రాష్ట్ర అభివృద్ధికి పునాది



