బిబిపేట పెద్ద చెరువులో పడి యువకుడు దుర్మరణం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 14 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో పెద్ద చెరువు లో గల ఒక కుంటలో చేపల వేటకు వెళ్లిన గుర్రం లక్ష్మణ్ (40) రాత్రి 10 గంటల వరకు రాకపోయేసరికి రాత్రి నుండి కుటుంబ సభ్యులు వెతుక సాగారు. ఉదయం బీబీపేట చెరువు లో గల ఒక కుంట దగ్గర చెప్పులు సైకిల్ ఉన్న దని సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు అక్కడి కుంటలో వలవేసి చూడగా వలకు చిక్కిన లక్ష్మణ్ శవాన్ని బయటకు తీశారు. సమాచారం అందుకున్న బీబీపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరి పంచనామా చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు పంపించడం జరిగింది. మృతుడికి భార్య మంజుల, కూతురు శిరీష కుమారుడు నిఖిల్ ఉన్నారు.
You may also like
నూతన సర్పంచులకు, ఉప సర్పంచ్లకు, వార్డ్ మెంబర్లకు,సన్మానం టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
దోమకొండ, అంబారీ పేట్, పరిధిపేట్ గ్రామ సరిహద్దుల్లో చిరుత సంచారం…
ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత పోలింగ్ ప్రక్రియ…
సంక్రాంతికి అదనంగా 41 ప్రత్యేక రైళ్లు..!
23, 27 తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..?



