ఈనెల చివరిలోగా ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 15 (అఖండ భూమి న్యూస్)
తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా ఎన్నికలు జరగకుండా ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్న స్థానిక సంస్థలుకు పూర్తిస్థాయిలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం కోసం ఈనెల చివరిలోగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందస్తుగా ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి 16న రాష్ట్ర మంత్రివర్గంతో చర్చించి ఎన్నికల తేదీపై పూర్తిస్థాయిలో ఖరారు చేయనున్నట్లు తెలిపారు. మొదటి సారిగా ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు నిర్వహించి, జులై 20 లోపు సర్పంచ్ ఎన్నికలపై పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చే విధంగా మంత్రివర్గం సీఎంతో చర్చల అనంతరం తేదీలు ఖరారు చేయనున్నట్లు తెలిపారు. జూలై 20 లోగా జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. జులై, ఆగస్ట్ ఆఖరిలోగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు పూర్తిచేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చల అనంతరం అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి ఆగస్టు 15 లోపు స్థానిక సంస్థలలో నూతన ప్రజాప్రతినిధులతో త్రివర్ణ పథకం ఎగురవేసే విధంగా రాష్ట్ర సర్కార్ దృష్టి సారించినట్లు సమాచారం.
You may also like
దుర్గామాతకు ఏ రోజు ఏ ప్రసాదం సమర్పించాలి..?
గ్రాడ్యుయేషన్లు జీవిత లక్ష్యం వైపు దృష్టి సారించాలి…
నాసిరకం నిత్యవసర వస్తువులను విక్రయిస్తున్న సూపర్ మార్కెట్లపై చర్యలు తీసుకోవాలి…
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు