బీబీపేటలో బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జూన్ 19 (అఖండ భూమి న్యూస్)
బీబీపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ కళ్యాణ మండపంలో బీబీపేట మండల బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు అల్లం ప్రవీణ్ మండల నూతన బీజేపీ కార్యవర్గాన్ని ప్రకటించారు.
ఉపాధ్యక్షులుగా నర్సాగని సంతోష్ గౌడ్, కందుకూరి స్వామి గౌడ్, పొన్నల మల్లేశం, చిన్న మల్లారెడ్డి, ఉప్పు నారాయణ, ధర్మగారి కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శులుగా పిడుగు శ్రీనివాస్, దేవరాజ్ గౌడ్ కార్యదర్శులుగా చెన్నము సిద్ధరాం రెడ్డి, మెట్టు రవీందర్, దాకురి అమ్రేష్, బుర్రగారి రవీందర్, లింగాల వంశీ గౌడ్, కోశాధికారిగా మామిడాల రమేష్, యువ మోర్చా అధ్యక్షులుగా చింతకుంట్ల సంతోష్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షులుగా లక్కర్స్ సంధ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా బాల్ నర్సయ్య, కిషన్ మోర్చా అధ్యక్షులుగా ధర్మారెడ్డి, ఓ బి సి మోర్చా అధ్యక్షులుగా మహేందర్ లకు బాధ్యతలు ఇవ్వడం జరిగిందని అన్నారు. అనంతరం నూతన మండల కార్యవర్గాన్ని బూత్, మండల, జిల్లా నాయకులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.