భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మైనార్టీ మోర్చా మోమిన్ షబానా 

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మైనార్టీ మోర్చా మోమిన్ షబానా

సంకల్ప సభ ఏర్పాటు

( ఆత్మకూర్),అఖండ భూమి న్యూస్, 19- జూన్

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం,  ఆత్మకూరు పట్టణంలో 67,వార్డులో   ఆత్మకూరు అర్బన్ మండలాధ్యక్షుడు శ్రీ రవీంద్రారెడ్డి  ఆధ్వర్యంలో, జాతీయ కార్యవర్గ సభ్యురాలు మైనార్టీ మోర్చా మోమిన్ షబానా, మాట్లాడుతూ,వికసిత భారత సంకల్ప సభ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు అయిన సందర్భంగా భారత ప్రధాని,నరేంద్ర మోదీ పాలన గురించి వివరించడం జరిగింది. అనంతరం వార్డు లోని ప్రజలతో అవినీతి రహిత , వివక్ష లేని,  సామరస్య పూర్వకమైన, సమాజాన్ని నిర్మిస్తామని , ప్రజా జీవితంలో,ఎల్లప్పుడూ నిజాయితీ పారదర్శకత పాటిస్తూ జాతి ప్రయోజనాల పట్ల తిరుగులేని నిబద్ధతతో వ్యవహరిస్తామని, బాధ్యతాయుతంగా కర్తవ్య బద్ధుడనై , దేశభక్తి గల పౌరుడిగా దేశానికి సే

సేవచేస్తానని,దేశసేవని అత్యున్నతంగా భావిస్తానని  వికసిత భారత్  2047 కలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తానని తన మన ధనముల ద్వారా మనస్ఫూర్తిగా సహకరిస్తానని  ప్రజలతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణ  ప్రధాన కార్యదర్శి  పద్మావతి, మైనార్టీ నాయకులు అన్వర్, చిట్యాల బాలనాగిరెడ్డి, స్వచ్ఛభారత్ కన్వీనర్ చిన్న,తదితరులు పాల్గొన్నారు,,,

Akhand Bhoomi News

error: Content is protected !!