జంగంపల్లిలో వికసిత భారత్ సంకల్ప సభ విజయవంతం..
కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకట రమణారెడ్డి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి: జూన్ 19 (అఖండ భూమి న్యూస్)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకొని 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వికసిత భారత్ సంకల్ప సభ భిక్కనుర్ మండలం జంగంపల్లి గ్రామంలోనీ వాసవి గార్డెన్స్ లో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిథిగాకామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాజీ MLA అరుణా తార హాజరై అనంతరం వాసవి గార్డెన్స్ ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అరుణా తార మాట్లాడుతూ నరేంద్రమోదీ గత 11 సంవత్సరాలుగా అనేక విజయాలు సాధించడం జరిగిందని ఆర్దికంగా, సాంస్కృతికంగా, దౌత్య పరంగా, అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు నడిపించడంలో నరేంద్ర మోదీ విజయం సాధించారని అన్నారు. పల్లె నుండి పట్నం వరకు, గల్లి నుండి డిల్లీ వరకు జరిగిన ప్రతి అభివృద్ధి పనిలో కేంద్ర ప్రభుత్వ వాట ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో భారత్ ను విశ్వగురువుగా తీర్చి దిద్దడమే మోది లక్ష్యం అని అందుకు ప్రతి బీజేపీ కార్యకర్త కంకణ బద్ధుడై ఉండాలని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ తిరుగులేని మెజారిటీ సాధించిందనీ, అదే స్ఫూర్తితో వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.