స్పెషల్ డ్రైవ్ ద్వారా జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 110 మొబైల్ ఫోన్ల రికవరీ…

స్పెషల్ డ్రైవ్ ద్వారా జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 110 మొబైల్ ఫోన్ల రికవరీ…

• బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి పోగొట్టుకున్న మొబైల్ పొందవచ్చు.

• ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in లొ రిజిస్టర్ చేసుకోవాలి ..

• మొబైల్ రికవరీలలో రాష్ట్రంలోని జిల్లాలలో కమిషనరేట్లను మినహాయిస్తే, కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానం..

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ వెల్లడి..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 19 (అఖండ భూమి న్యూస్)

సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరికి గురైన 110 మొబైల్ ఫోన్లను ( సుమారు 16 లక్షల విలువగల) మొబైల్ లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించడం జరుగుతుంది అని తెలియజేశారు.

ఈ మొబైల్ రికవరీలలో రాష్ట్రంలోని జిల్లాలలో కమిషనరేట్లను మినహాయిస్తే, కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఇప్పటివరకు 3263 మొబైల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది అని అన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. మొబైల్ పోయిన లేదా చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ కు వెళ్ళి దరఖాస్తు ఇవ్వాలి సిమ్ కార్డ్ బ్లాక్ చేసి అదే నంబరు గల కొత్త సిమ్ తీసుకోవాలి అన్నారు. తద్వారా పోయిన మొబైల్ ఫోన్ల ఐ ఎం ఈ ఐ వివరాలు సి ఈ ఐ ఆర్ వెబ్సైట్ లో బ్లాక్ చేయడం వలన పోగొట్టుకున్న మొబైల్ సులబంగా దొరికే అవకాశం ఉందని అన్నారు. ఫోన్ పోయినవారు మొబైల్ పోయినవారు సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయాలని వివరించారు.

జిల్లా పోలీసు కార్యాలయములో పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక ఆర్ ఎస్ ఐ, 10 మంది కానిస్టేబుల్స్ తో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు. గత (10) రోజులలో ఈ టీం అధికారులు 110 ఫోన్ లను రికవరీ చేయడం జరిగింది అన్నారు.

ఈ సందర్భంగా 110 మొబైల్ ఫోన్ల రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన టీం సబ్యులు అందరినీ జిల్లా ఎస్పీ అభినందించారు.

ఇప్పటి వరకు రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలిజేయడం జరుగుతుంది. వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్.ఎస్.ఐ బాలరాజ్ గారిని సంప్రదించి (8712686114) ఫోన్ కు సంభంధించిన వివరాలు చూపించి తీసుకోవాలని తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!