యశోదలో విజయవంతంగా కాంప్లెక్స్ వాస్కులర్ సర్జరీ
– సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వాస్కులర్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 19.(అఖండ భూమి న్యూస్)
సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో తీవ్రమైన ఎడమ కాలు నొప్పి, వాపు, ఫుట్ అల్సర్ వంటి గాయాలతో బాధపడుతున్న పల్లె రాములు ( 49 ) సర్జరీ చేసి విజయవంతంగా ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందని ప్రముఖ వాస్కులర్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోనీ యశోద కన్సల్టెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్, ఎండో వాస్సులర్ సర్జన్, డయబెటిక్ ఫుట్ స్పెషలిస్ట్ నేతృత్వంలోని ఉత్తమమైన నిపుణుల బృందం ఎడమ సాధారణ ఇలియాక్ థమని (సి.ఐ. ఏ) స్టెంటింగ్, సాధారణ తొడ థమని, ఉపరితల తోడ థమని (ఎస్.ఎఫ్.ఏ) ఫిమోరల్ అర్డరీ (ఎస్.ఎఫ్.ఏ. పూర్వ టిబియల్ ఆర్టరీ (ఏ.టి.ఏ) యాంజియోప్లాస్టీ వంటి చికిత్సను ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తయిందన్నారు. రాములు పల్లె కుడి కాలి బొటనవేలుకి గాయం కావడంతో కుడి కాలు నొప్పి, వాపు, పాదంలో పుండు వంటి సమస్యలతో 11 ఏప్రిల్ 2025 హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగిందన్నారు. పేషంట్ కి పెరిఫెరల్ ఆర్ధరీ డిసీజ్ (పి.ఏ.డి.) ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. వ్యాధి యొక్క తీవ్రత దృష్ట్యా, అనుభవంతులైన వైద్య బృందం ఐవీ యాంటీబయాటిక్స్ తో చికిత్స అందించినట్లు తెలిపారు. పేషంట్ రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి, లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు స్టంటింగ్. యాఇజియోప్లాస్టితో సహా సమర్థవంతమైన వాస్కులర్ సర్జరీని చేయడం జరిగిందన్నారు. ఈ కేసు ముదిరిన వయస్సు, మధుమేహంతో కూడిన తీవ్రమైన పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధికి ఒక అద్భుతమైన ఉదహరణ అని తెలిపారు. ఖచ్చితమైన ప్రణాళిక నిర్దారనతో మేము రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించగలిగామని తెలిపారు. అనుభవంతులైన వైద్యుల పర్యవేక్షణలో మల్లయ్యా త్వరగా కోలుకుని ఏప్రిల్ – 12, 2025 న డిశ్చార్జ్ అయ్యారన్నారు. గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 4 బ్రాంచ్ లు (సికింద్రాబాద్, సోమాజిగాడ, మలక్పేట, హైటిక్ సిటీ), 5వేల పడకలు కలిగి ఉన్న అతి పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య అవసరాలకు అనుగుణంగా అనుభవంతులైన వైద్యలచే, అధునాతన సాంకేతికతలతో ఇప్పుడు అందరికి చేరువలో కార్పోరేట్ వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు. పేషంట్ అవసరాలకు అనుగుణంగా అనునిత్యం మార్గనిర్దేశం చేయబడుతుందన్నారు. అరుదైన, సంక్లిష్టమైన విధానాలకు కూడా సంపూర్ణ మిళిత విప్లవాత్మక సాంకేతికత ద్వారా చికిత్సలను అందిస్తున్నామని వివరించారు. యశోద హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.