అంతర్జాతీయ యోగ దినోత్సవం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జూన్19. (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా బాన్సువాడ యోగ టీచర్ ఓట్లం శ్రీనివాస్ మండల పరిషత్ మీటింగ్ హాల్ లో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు యోగ క్లాసులు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మేడం మాట్లాడుతూ యోగ అనేది నేటి కాలంలో అందరు చేయవలసిన అవసరం ఉందని అందువలన శారీరక,మానసిక ఆరోగ్యం బాగుంటుందని అన్నారు.తేది.21.6.2025 రోజున బాన్సువాడ లోని అంబేద్కర్ భవన్ లో జరిగే యోగ కార్యక్రమానికి ఉదయం 7 గంటల కల్లా ప్రజా ప్రతినిధులు,ప్రజలు,అధికారులు,మీడియా సోదరులు అందరు తప్పక హాజరు కావాలని కోరారు.