ప్రపంచ యోగ దినోత్సవ సందర్భంగా ప్రదర్శన…

ప్రపంచ యోగ దినోత్సవ సందర్భంగా ప్రదర్శన…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 21 (అఖండ భూమి న్యూస్)

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా దోమకొండ మండల కేంద్రంలో యోగశాలలో శనివారం యోగాసనాలు వేసి ప్రదర్శన నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాసనాలు వేసి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. యోగాతోనే ప్రస్తుతం విస్తరిస్తున్న అనేక రోగాలకు ముందస్తుగా యోగా నిర్వహిస్తే వాటిని ఎదుర్కొనే సత్తా యోగాసనాల ద్వారా ఉందని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా నిలదొక్కుకోవాలంటే యోగాను నిత్య పనిగా పరిగణించి ఆసనాలు వేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు అంకం బాలరాజ్, గర్దాస్ కృష్ణ హరి, రాజు, అబ్రా బోయిన స్వామి, అల్లి రవి, ముత్యం గౌడ్, కుంచాల సత్యనారాయణ, ఎల్లన్న, పెద్దిరెడ్డి రాజిరెడ్డి, సుధాకర్, కృష్ణారెడ్డి, సలీం, బొ రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!