అంతర్జాతీయ యోగ దినోత్సవం

అంతర్జాతీయ యోగ దినోత్సవం లో పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 21 (అఖండ భూమి న్యూస్)

ప్రపంచ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ని యోగ భవన్లో ఏర్పాటుచేసిన యోగా శిబిరంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి శనివారం పాల్గొన్నారు. యోగాసనాలు అందరితో కలిసి ప్రపంచ యోగ దినోత్సవం లో పాల్గొన్నారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యోగాతోనే రాబోయే రోగాలను పరిగణలోకి తీసుకొని నిత్యం యోగా చేస్తే రోగాలు మటుమాయం అవుతాయని అన్నారు. యోగాను నిత్యం ఒక శరీరక వ్యాయామంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని పదులపరుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ప్రజలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!