“వ్యాపార సంస్థలుగా మారిన ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 22 (అఖండ భూమి న్యూస్)
విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్…
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. విద్యార్ధి సేన నాయకుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి, విద్యార్థుల తల్లిదండ్రులపై భారీ ఆర్థిక భారం మోపుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, పాఠశాలలు బలవంతంగా పుస్తకాలు, యూనిఫారాలు, స్టేషనరీ వస్తువులు తమ సరఫరాదారుల నుంచి కొనుగోలు చేయించేందుకు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయని తెలిపారు. ప్రవేశ రుసుములు, వార్షిక ఫీజులు, యాక్టివిటీ ఫీజులు, ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు తదితర వివిధ పేర్లలో వేలాది రూపాయల వసూలు చేయడం వల్ల మధ్యతరగతి , పేద కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సమస్యలతోనూ, విద్య నుండి దూరమవుతున్నారని పేర్కొన్నారు.
పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని, పిల్లల కోసం ప్లేగ్రౌండ్, శుభ్రత, మౌలిక సౌకర్యాలు లేకుండా నడుస్తున్నట్టు పేర్కొన్నారు. కొన్ని పాఠశాలలు ప్రభుత్వం నుండి ఎటువంటి గుర్తింపులు లేకుండా అక్రమంగా నడుస్తున్నాయని, ఇది విద్యా ప్రమాణాలను, పిల్లల భవిష్యత్తును ముప్పులో పెట్టుతోందని హెచ్చరించారు. విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాధికారి (డీఈవో)వెంటనే స్పందించి, ఈ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో
విద్యార్థి సేన తరుపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన నాయకులు మధు గుమ్ముల, అమన్, ఇక్క శ్రీనివాస్,కరణ్, శ్రీకాంత్, సురేష్,ప్రవీణ్, అనిల్, బెనిన్, మరియు తదితరులు పాల్గొన్నారు.
You may also like
ఈనెల 18న అమరావతికి బిల్ గేట్స్.. చంద్రబాబుతో కీలక భేటీ …!
కామారెడ్డిలో కాంగ్రెస్కు భారీ మద్దతు…
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…



