ప్రాంతీయ క్రీడల స్టోర్స్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రవేశానికి క్రీడాకారుల ఎంపిక…

ప్రాంతీయ క్రీడల స్టోర్స్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రవేశానికి క్రీడాకారుల ఎంపిక…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 23 (అఖండ భూమి న్యూస్);

వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, ఎస్ ఏ టి జి, తెలంగాణ వారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్, హకీంపేట్, ప్రాంతీయ క్రీడ పాటశాల, కరీంనగర్ , ఆదిలాబాద్ లో 20 బాలురు , 20 బాలికలు చొప్పున 2025-26 సంవత్సరానికి గఎల్ నాల్గవ తరగతిలో ప్రవేశానికి ఎంపిక కొరకు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ కార్యాలయము, కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎంపిక కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో తొమ్మిది రకాల క్రీడ పోటీలు నిర్వహించి ఉత్తమమైనటువంటి పదిమంది బాలురు పదిమంది బాలికలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలలో ఒకటి, రెండవ జూలై రోజున అకీంపేట్ స్కూల్, హైదరాబాద్ లో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తారని తెలిపినారు. రాష్ట్ర స్థాయిలో కూడా మన జిల్లా బాలురు బాలికలు ఉత్తమ ప్రతిభ చూపించాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఇందులో భాగంగా ఇందిరాగాంధీ స్టేడియంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కామారెడ్డి, తాసిల్దార్ కామారెడ్డి, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ హీరలాల్, వ్యాయామ ఉపాధ్యాయులు , మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!