పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులను ప్రోత్సహించడం సరికాదు 

పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులను ప్రోత్సహించడం సరికాదు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 25 (అఖండ భూమి న్యూస్)

జాతీయ మానవ హక్కుల కమిటీ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు విలేకరుల సమావేశంలో జాతీయ మానవహక్కుల కమిటీ జిల్లా చైర్మన్ విజయ భాస్కరరావు. జిల్లా సహాయ కార్యదర్శి కటికం రాజిరెడ్డి మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం పహల్గామ్ లో భారతీయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని దేశంలో టూరిస్టులపై కాల్పులు జరిపి చంపడం మానవ హక్కులకు భంగం కల్పించడం అని ఇలాంటి ఉగ్రవాదులకు పాకిస్తాన్ లాంటి దేశం సపోర్ట్ చేయడం సరికాదని మానవత్వం లేకుండా మనుషులను చంపుతున్న ఉగ్రవాదులకు భారతదేశ ఆర్మీ పౌరులు తగిన బుద్ధి చెప్పడం ఇంతవరకు కేవలం అది ట్రయల్ గా మాత్రమే చేయడం జరిగిందని భారతదేశ ఆర్మీ పౌరులు కేవలము ఉగ్రవాదులపైనే దాడి చేసి తగిన గుణపాఠం చెప్పడం జరిగిందని ఇప్పటికైనా ఉగ్రవాదులు ఎక్కడున్నా తమ తీరును మార్చుకోకపోతే భారతదేశం ఆర్మీ పౌరులు వెతికి గుణపాఠం చెప్పడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్ సి జిల్లా చైర్మన్ విజయ భాస్కరరావు, జిల్లా కన్వీనర్ రవీందర్ రెడ్డి. జిల్లా సహాయ కార్యదర్శి కటికం రాజిరెడ్డి జిల్లా మీడియా ఇన్ఛార్జ్ సంకి నారాయణ రాజంపేట మండల చైర్మన్ గండెం నాగభూషణం. పాల్వంచ మండల చైర్మన్ అంబాల రవి. పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!