పోయిన గోల్డ్ అందజేత యస్ ఐ పి. చౌడయ్య

పోయిన గోల్డ్ అందజేత యస్ ఐ పి. చౌడయ్య

యర్రగొండపాలెం:అఖండ భూమి వెబ్ న్యూస్

యర్రగొండపాలెం మండలంలోని అయ్యంబోట్లపల్లి గ్రామానికి చెందిన పెదపోగు కోటయ్య అనే వ్యక్తి 31/06/2025 తేదీన

యర్రగొండపాలెంలోని ఓ బ్యాంకులో గోల్డ్ పెట్టి తన కుటుంబ అవసరార్థం డబ్బులు తీసుకుందామనే క్రమంలో యర్రగొండపాలెం వచ్చాడు పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా వద్ద సోడా తాగుతూ గోల్డ్ జారవిడుచుకొని వెళ్ళిపోతాడు బ్యాంకు కి వెళ్లి చూస్తే గోల్డ్ ఉండదు తిరిగి వెళ్లి ఆ సోడా బండి దగ్గర వెతుకుతూ ఉండగా సోడా బండి యజమాని ఏమైంది పెద్దాయన అని అడుగుతాడు ఇక్కడ సోడా తాగుదామని వచ్చి గోల్డ్ పోగొట్టుకున్నాను బ్యాంకు కి వెళ్లి ఎంత చూసినా కనిపించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు వెంటనే సోడా బండి యజమాని అతను వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి సోడా తాగిన విషయాన్ని గమనించి సోడా బండి అతనికి ఫోన్ పే చేసిన విషయాన్ని అతనికి చెప్పాడు వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయగా పట్టణ ఎస్సై పి చౌడయ్య వెంటనే స్పందించి ఫోన్ పే నెంబర్ను ట్రేస్ అవుట్ చేసి ఆ వ్యక్తిని గుర్తించి పట్టుకున్నారు. బాధిత వ్యక్తికి గోల్డ్ అందజేశారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ పోయిన తన బంగారంను వెతికి తనకు అప్పగించేందుకు కృషి చేసిన ఎస్సై పి చౌడయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!