కామారెడ్డి ,దోమకొండ , బిబిపేట్ మండలాల్లో పలు ప్రారంభోత్సవాలు చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి…

కామారెడ్డి ,దోమకొండ , బిబిపేట్ మండలాల్లో పలు ప్రారంభోత్సవాలు చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 1 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా దోమకొండ, కామారెడ్డి, బిబిపేట్ మండలాల్లో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆయన సొంత నిధులతో మంగళవారం పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. బివిపేట్ మండలంలోని బీబీపేట్, మాందాపూర్, దోమకొండ మండలంలోని సంగమేశ్వర్, దోమకొండ, కామారెడ్డి మండలంలోని రాఘవపూర్, క్యాసంపల్లి, ఉగ్రవాయి, శబ్దీపూర్, చిన్న మల్లారెడ్డి గ్రామాలలో పలుకుల సంఘాల రేకుల షెడ్డు, సంఘ భవనాలు, గ్రానైట్, సిమెంట్ ఇటుక, ఆలయాల నిర్మాణాలు ఇతర సంఘాల పనుల ప్రారంభోత్సవాలు చేశారు. కుల సంఘాలు పరిశ్రమగా ఉంటేనే పల్లెలు, పట్టణాలు బలోపితం అవుతాయని అన్నారు. దేవాలయాలతో రాబోయే తరానికి ఆధ్యాత్మికత, దేవుడి ఆశీస్సులు కలిగి జనజీవనం సుఖసంతోషాలతో గడపాలని ఉద్దేశంతోనే చిన్నపాటి పనులను నిర్వహించి వారికి సహకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు, ఆయా గ్రామాలకుల సంఘాలు, ప్రజలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!