డాక్టర్ ఫరీదా బేగం కు సన్మానం…

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ ఫరీదా బేగం కు సన్మానం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జులై 1 (అఖండ భూమి న్యూస్)

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.ఆర్.కె జూనియర్ మరియు ఒకేషనల్ కళాశాల,కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ ఫరీ దా బేగం ను సన్మానించడం జరిగింది.

 

ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్కె విద్యాసంస్థల సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డి, కామారెడ్డి రక్తదాతల దాతల సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రపంచంలో డాక్టర్లు కు మాత్రమే భగవంతుని తరువాత భగవంతుని స్థానాన్ని ఇవ్వడం జరిగిందని,ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతూ ఆదర్శంగా నిలుస్తున్న వైద్యుల సేవలు వెలకట్టలేనివని అన్నారు.కరోనా వ్యాధి సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం ప్రయత్నించి కొందరు డాక్టర్లు కరోనా వ్యాధికి బలి కావడం జరిగిందని వారి సేవలు చిరస్థాయిలో నిలిచిపోతాయని అన్నారు.

 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ ఫరీదా బేగం మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటినుండే ఉన్నత స్థాయి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని దానిని సాధించడం కోసం సరియైన ప్రణాళిక,దృఢ సంకల్పం, కష్టపడే స్వభావం ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాన్ని అయినా అధిరోహించవచ్చునని సూచించారు.డాక్టర్ వృత్తిలోకి రావాలనుకునే విద్యార్థులు ఇప్పటినుండి సహనం,ఓపిక కష్టపడే తత్వాన్ని పెంపొందించుకోవాలని అప్పుడే విజయాన్ని సాధించగలుగుతారని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శంకర్,డీన్ నవీన్ కుమార్,అధ్యాపకులు ప్రసన్న, శ్రీవాణి,సంజ్యోతి,శ్రీనివాస్, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!