రాంజానే మరణానికి కారకులు ఎవరు..?
-పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు..?
-అప్పు ఒత్తిళ్లతోనేనా..?
-నా చావుకు ఐదుగురు కారణమని స్టేటస్ పెట్టినట్టు సమాచారం..?
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్: 01 జూలై (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్, పట్టణం రాంనగర్ కాలనీకి చెందిన దోండి ఖోబ్బానీ సంజయ్ (అలియాస్ రాంజానే) చిట్టీలు, ఫైనాన్స్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తుండేవాడు. సంజయ్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. క్రికెట్ బెట్టింగ్, మట్కా, జూదం ఆటలకు అలవాటు పడి అప్పుల ఊబిలో మునిగిపోయాడు. అప్పులు ఇచ్చినవారు గత కొన్ని రోజుల నుంచి ఒత్తిడి తీసుకురావడంతో ఏమి చేయాలో తోచక గత ఐదు రోజుల క్రితమే తన చావుకు ఐదుగురు కారణమని స్టేటస్ పెట్టినట్లు సమాచారం. సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి విందు లో పాల్గొని రాత్రి పది గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. మంగళవారం ఉదయం శవమై కనిపించాడు. రాంజానే ది సహజ మరణమా, అప్పుల వారి ఒత్తిళ్లకు ఆత్మహత్య చేసుకున్నాడా అనే వివరాలు తెలియవలసి ఉంది..?



