గ్రామపంచాయతీ కార్మికులు జులై 9 దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చెయ్యాలి…
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రాజనర్సు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 30 (అఖండ భూమి న్యూస్)
శతాబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక త్యాగాల పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లోని 29 కార్మిక చట్టం రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది ఈ కోడ్ ఆమాలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుంది అని సిఐటియు కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కొందారపు రాజన్న. సోమవారం ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల .సమిష్టి భేరాసాల శక్తి నిర్వీర్యం చేయబడుతుంది ఉద్యోగ భద్రత కోల్పోతారనీ, కార్మిక శాఖ కూడా నిర్వీర్యం చేయబడుతుంది అన్నారు. దేశం నుండి పరిస్థితిని అంతటిని సమీక్ష చేసిన కేంద్ర కార్మిక సంఘాలు స్వాతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు 2025 మేన దేశవ్యాప్తక సమ్మెకు పిలుపునిచ్చాయి. కానీ 2025 ఏప్రిల్ 25న పహాల్గం మార్గంలో జరిగిన ఉగ్రవాదాడిలో 26 మంది మరణించడం బాధాకరం అన్నారు. మే20 యోజన ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది ఈ నేపథ్యంలో దేశ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 2025 నిన్న జరగవలసిన సమ్మెను 2025 జూలై 9 కి మార్పు చేసింది అని గుర్తు చేశారు. జులై 9 జరిగే సమ్మెను తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని, గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని చేసిన వేతనాలు వెంటనే ఇవ్వాలని నాలుగు లేబర్ కోళ్ల రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేట్ కారణ ఆపాలని, స్థానిక సంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలనీ అన్నారు. పంచాయతీ సిబ్బందిని కూడా రెండవ పిఆర్సి పరిధిలోకి తీసుకోవాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అని అన్నారు.ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలన్నారు. కలిసి వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. జీవో నెంబర్ 51 సవరించాలి మల్టీపర్పస్ మీద రద్దు చేసి పాత కేటగిరిలోని కొనసాగించి నియమించాలన్నారు. పంచాయతీ సిబ్బందికి రిటర్మెంట్ బెనిఫిట్ 10 లక్షలు ఇవ్వాలి ఇన్సూరెన్స్ 10 లక్షలు చెల్లించాలనీ అనారోగ్యానికి గురైన చనిపోయిన కార్మిక స్థానంలో వారి కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇవ్వాలన్నారు. తదితర న్యాయమైన డిమాండ్ల కోసం గ్రామపంచాయతీ కార్మికులు జూలై 9 చేసే సమ్మెను విజయవంతం చేయాలని, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి నాలుగురేబర్ కోర్టులను రద్దు చేసి పాద చట్టాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ నాయక్, బాల నర్సు, మాచారెడ్డి పాల్వంచ నర్సింలు దశరథ రెడ్డి, బాలకిషన్, పోతారం రవి, తదితరులు పాల్గొన్నారు.