అధికారులు నిర్లక్ష్యం చేయకుండా జవాబీదారుగా పని చేయాలి…

ప్రజావాణిలో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి..
141 దరఖాస్తుల స్వీకరణ.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జూన్ 30 (అఖండ భూమి న్యూస్)
అధికారులు జవాబీదారుగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు.
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో లో ప్రజల నుంచి కలెక్టర్ , అదనపు కలెక్టర్ విక్టర్ ,లోకల్ బాడీ కలెక్టర్ చందర్ డిఆర్డిఓ పి.సురేందర్, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడారు.
పెండింగ్ దరఖాస్తులపై
శ్రద్ధ పెట్టాలని , ప్రజావాణిలో మొత్తం 141 దరఖాస్తు వచ్చాయని, వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను కూలం కషంగా పరిశీలించి, పెండింగ్ ఉంచకుండా, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్‌లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…


