ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్ లోనే నివాసం ఉండాలని

 

ఈ మెమో నెంబర్ 3346/19/TA/2005 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్ లోనే నివాసం ఉండాలని అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ రమాకాంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిని పర్యవేక్షించవలసిందిగా కంట్రోలింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారి విషయంలో అన్ని డిపార్ట్మెంట్ల అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు ఆదేశాలను దిక్కరించి ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ మెమోలో చెప్పడం జరిగింది. అయితే అనేక విద్యాసంస్థల ప్రతినిధుల యొక్క అభ్యర్థన మేరకు వితంతువులు, వికలాంగులైన టీచర్లకు, ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలకు కొన్ని మినహాయింపులు ఇవ్వడం జరిగింది. అంతర్ జిల్లాల నుండి అంతర్ రాష్ట్రాల నుండి హెడ్ క్వార్టర్స్‌కు వచ్చి పనిచేస్తున్న ఉద్యోగుల మీద ఆధారాలతో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తే వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ ఉద్యోగులు హెడ్ క్వార్టర్స్‌లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటారు.

Akhand Bhoomi News

error: Content is protected !!