జర్నలిస్టుల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం

 

వెల్దుర్తి మే 8 (అఖండ భూమి) :

జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, అక్రిడేషన్ల కోసం ఇచ్చిన జీవో వల్ల జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెల్దుర్తి జర్నలిస్టు సంఘం నాయకులు స్థానిక తాసిల్దార్ కార్యాలయం నందు డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులు అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్న అనేక సౌలభ్యాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఈ వైఖరి పట్ల వర్కింగ్ జర్నలిస్టులు అందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నామని పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. లేని పక్షంలో ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

జర్నలిస్టుల డిమాండ్స్ :-

1. ఎలక్ట్రానిక్ మీడియాకు జిల్లా కేంద్రంలో నాలుగు అదనపు అక్రిడేషన్లు మంజూరు చేయాలి.

2.న్యూస్ పేపర్స్ కు సర్కులేషన్ తో సంబంధం లేకుండా అక్రిడేషన్స్ ఇవ్వాలి.

3. ఆర్ ఎన్ ఐ ఉన్న ప్రతి పత్రికకు గతంలో మాదిరి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా అక్రిడేషన్లు ఇవ్వాలి.

4. జిల్లాలో ప్రింట్ అవుతున్న చిన్న పత్రికలకు నియోజకవర్గానికి నాలుగు అక్రిడేషన్ ఇవ్వాలి.

5. డెస్క్ జర్నలిస్టులు అందరికీ సర్కులేషన్ తో పని లేకుండా అక్రిడేషన్స్ ఇవ్వాలి.

6. జిల్లాల విభజన నేపథ్యంలో బస్సు పాసులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెల్లుబాటు అయ్యేలా ఇవ్వాలి.

7. జర్నలిస్టులు అందరికీ ఏసీ బస్సుల్లో కూడా పాసులు చెల్లెలా ఆదేశాలు ఇవ్వాలి.

8. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ 3 సెంట్ల ఇంటి స్థలం, మరియు ఇండ్లు మంజూరు చేయాలి.

9. జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు దాడుల నివారణ కమిటీని వెంటనే పునరుద్ధరించాలి.

10. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని పునరుద్ధరించాలి.

11. రైల్వేలో రాయితీలను పునరుద్ధరించాలి.

12. తమిళనాడు తరహాలో జర్నలిస్టులకు పారితోషకం ఇవ్వాలి

13. కరోనా వల్ల మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలను వెంటనే ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం అధ్యక్షులు అమీర్, అఖండ భూమి ఎడిటర్ ఈశ్వరయ్య, ఒమేంద్ర, మారెన్న, దస్తు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!