కోడుమూరు అఖండ భూమి వెబ్ న్యూస్ : –
C బెలగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన
కోడుమూరు ఎమ్మెల్యే..
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని C బెలగల్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ జరదొడ్డి సుధాకర్ గారు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మండల కేంద్రంలో బస్టాండ్ అవరణలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం మల్టీ సర్వీస్ లో భాగంగా ₹36 లక్ష రూపాయల రుణాలతో 16 గదులను నిర్మించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ గోపాల్ రెడ్డి, మండల ఎంపీపీ బొంతల మునెప్ప,మండల జడ్పిటిసి గిరిజోను, వ్యవసాయ సలహా మండలి సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మండల కన్వీనర్ తులసి రెడ్డి, ఎంపీటీసీ ఈరన్న గౌడ్, డైరెక్టర్ చిన్న, మండల కార్యదర్శి మద్దిలేటి, ఎక్స్ సింగిల్ విండో ప్రెసిడెంట్ గోవింద్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ఎస్ఎం భాష, మహానంది , వైస్ ప్రెసిడెంట్ ఇబ్రహీం, సర్పంచ్ పాండురంగన్న, మండల కార్యదర్శి టీజి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


