సిగినాపల్లి రంగురాళ్ల క్వారీపై గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి నిఘా పెట్టి చర్యలు చేపడతాం.

 

అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి (అఖండ భూమి) అల్లూరి జిల్లా: గూడెం కొత్త వీధి మండలం

సిగినాపల్లి రంగురాళ్ల క్వారీపై గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి నిఘా పెట్టి చర్యలు చేపడతాం.

శ్రీకంఠ నాథ రెడ్డి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టర్ అన్నారు ఇటీవల కాలంలో అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని సిగినాపల్లి రంగురాళ్ల క్వారీలో భారీ ఎత్తున రంగరాలు తవ్వకాలు జరుగుతున్నాయి అంటూ మన్యంలో వస్తున్న వార్తల నేపథ్యంలో అటవీ ప్రాంతంలో రంగురాళ్ల క్వారీలపై ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాల్ని కట్టుదిట్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈరోజు సిగినాపల్లి, సంకాడ అటవీ ప్రాంతంలో రంగురాళ్లు తవ్వకాలు జరుగుతున్నాయని వచ్చిన వార్తల్లో నిజ నిరూపణ చేసేందుకు రంగురాళ్ల క్వారీలను సందర్శించడం అయినదని ఇందులో భాగంగా రంగుల రంగురాళ్ల క్వారీలు పూర్తిస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఎత్తైన అటవీ ప్రాంతంలో ఈ రంగురాళ్ల వారీలపై ఈ పరిసర ప్రాంతాల ప్రజలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని సంకాడ గ్రామం, సిగినాపల్లి, దొడ్డి కొండ, తీముల బంధ, నల్లబిల్లి కొత్తూరు, గండం పెళ్లి, అసరాడ, రింతాడ, లింగవరం, గ్రామ ప్రజలు కాపాడుకోవాల్సిన బాధ్యతలు ఎంతైనా ఉందని అన్నారు. అటవీ సంపద సంరక్షించుకుంటూ ఆదాయ మార్గాలకు ఎక్కువ కృషి చేయాలని అన్నారు. ఈ ప్రాంతంలో రంగురాళ్ల వ్యాపారులు ప్రోత్సహించిన, రంగురాళ్ల తవ్వకాలకు వెళ్లిన అటువంటి వారిని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో గాని, ఫారెస్ట్ శాఖలకు గాని వీలైన తొందర్లో సమాచారం తెలియజేయాలని ప్రజలకు తెలిపారు, ఎటువంటి వ్యక్తులైన చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే చట్టపరమైన శిక్షలకు గురి అవుతారని ఈ ప్రాంత ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్క్వాడ్ డిఎఫ్ఓ ఎం శ్యామ్ సుందర్, సిహెచ్ సూర్యనారాయణ పడాల్రేంజ్ ఆఫీసర్ జగదీష్, ఫారెస్ట్ సె క్షణ ఆఫీసర్లుబీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లుపాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!