రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలకు అందించిన విశేష సేవలు, తోడ్పాటుకు గాను ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా ప్రతిష్టాత్మక గవర్నర్ పురస్కారాన్ని అందుకున్నారు. సోమవారం ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్.. కలెక్టర్ కృతికా శుక్లాకు పురస్కారం అందజేశారు. వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ సామాజిక సేవలో విశిష్టతను, తనదైన గుర్తింపును పొందిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకుంది. అయిదారేళ్లుగా వరుసగా రాష్ట్రస్థాయి అత్యుత్తమ పురస్కారాలు జిల్లాకు లభిస్తుండగా.. ఈ ఏడాది కూడా మరో అత్యుత్తమ పురస్కారం సాధించిన కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు, రెడ్‌క్రాస్ జిల్లాశాఖకు గవర్నర్ అభినందనలు తెలియజేశారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వాత్సల్య వృద్ధాశ్రమం, యోగా కేంద్రం, విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలు, తలసేమియా కేంద్రం, బ్లడ్ బ్యాంకు వంటి వాటితో నిబద్ధత, అంకితభావంతో సమాజానికి విశేషమైన సేవలు అందిస్తోందని.. ఇప్పటికే వివిధ అవార్డులు సొంతమయ్యాయని కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. ఈ ఏడాది కూడా గౌరవ గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా ఆనందం కలిగిస్తోందన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తుల్లోనూ మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా శాఖకు మంచి గుర్తింపు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా గవర్నర్ నుంచి అవార్డు అందుకోవడంపై రెడ్‌క్రాస్ జిల్లా శాఖ ఛైర్మన్ వైడీ రామారావు శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ డా. కృతికా శుక్లా నేతృత్వంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా శాఖ ఛైర్మన్ వైడీ రామారావు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


