రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డెస్క్ బెంచీల ప్రధానం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 3 (అఖండ భూమి న్యూస్)
కామరెడ్డి 6 వ వార్డు సరంపల్లి ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ అఫ్ సికింద్రాబాద్ వారు డెస్క్ బెంచీలు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఆకుల రూప రవి కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అలాగే డెస్క్ బెంచెస్ లు డొనేట్ చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తూరి పెద్ద సాయిలు, నిట్టు గంగాధర్ రావ్, బక్కన్నగారి రాజు, ముల్క రాజు, బక్కనగారి హన్మాండ్లు, మామిండ్ల అశోక్, సంగీశెట్టి రాజు, రామాంజనెయులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనిల్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పొన్నాల సంధ్య, ఉపాధ్యాయులు సుధారాణి, రాజయ్య, శిరీష, యమున విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో వీరికి ఆరోగ్యశ్రీ …
-
మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డిని పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
-
దంపతులు ఇరువురికి ప్రశంశ పత్రాలు…
-
అంగన్వాడి, రెసిడెన్షియల్ , సంక్షేమ హాస్టల్ లకు గుడ్ల సరఫరాకు టెండర్…
-
వన క్షేమమే మన క్షేమం – కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…