ఘనంగా మాజీ సీఎం కొలిశేటి రోశయ్య 4 జయంతి …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 4 (అఖండ భూమి న్యూస్)
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టరేట్లో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కొణిజేటి రోశయ్య 4వ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కొనిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. 2009 నుండి 2010 సంవత్సరం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తదనంతరం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్ గా పనిచేయడమే కాకుండా చాలా పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేసి తన రాజకీయ అనుభవంతో ప్రజలకు విశేష సేవ చేశారని అన్నారు. ఆయన సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చందర్ నాయక్, విక్టర్, రవికుమార్, టిజిఓ సెక్రటరీ సాయి రెడ్డి, టిఎన్జీవో అధ్యక్షులు వెంకట్ రెడ్డి, మరియు సభ్యులు, జిల్లా అధికారులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, కలెక్టరేట్ ఏవో సయ్యద్ మసూద్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
నర్సీపట్నం డిపోలో బస్సులు లేక ప్రయాణికులకు తప్పని బాధలు..
డియస్సి బయాలజి ఉదయం షిఫ్ట్ లో రాసిన ఉద్యోగులకు అన్యాయం…
ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నం



