నర్సీపట్నం డిపోలో బస్సులు లేక ప్రయాణికులకు తప్పని బాధలు..
అక్టోబర్ 4. అఖండ భూమి న్యూస్
నర్సీపట్నం డిపోలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నర్సీపట్నం నుంచి విశాఖపట్నం మరియు ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలకు, కళాశాలలకు, పాఠశాలలకు, ఆఫీస్ లకు వెళ్లేందుకు సమయానికి బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.ఆసుపత్రులకు వెళ్ళే పేషంట్స్ సైతం ఈ ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణికులు మాట్లాడుతూ ఆసుపత్రులకు, కళాశాలలకు,పాఠశాలలకు, విధుల నిర్వహణ నిమిత్తం ఆఫీస్ లకు పోయే వారికోసం డిపో మేనేజర్ ఆలోచించాలని తమ సమస్య లను చెప్పుకునేందుకు డిపో లో ప్రయాణికుల పిర్యాదుల నిమిత్తం ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ కి ఎన్ని సార్లు కాల్ చేసినా పనిచెయ్యడం లేదని ఇలా అయితే సమయానికి ఎవ్వరూ వెళ్ళలేరు అని వాపోయారు. గంటల కొద్దీ ప్రయాణికులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని, దీనితో ప్రయాణికులు విసుగు చెందుతున్నారని, అధికారులను అడిగితే డిపోలో బస్సులు లేవని ఘాటుగా సమాధానమిస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు.


