భారతదేశంలో దేవుని పేరు మీద మత రాజకీయాలు …
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్బాస్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 10 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రాజకీయ శిక్షణ తరగతులు గురువారం నాలుగు రోజులపాటు నిర్వహించారు. మొదటి రోజు క్లాసులను బోధించడానికి వచ్చిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు క్లాస్ ప్రారంభిస్తూ ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. బిజెపి ఆర్ఎస్ఎస్ పుట్టకముందే ఈ దేశంలో దేవుళ్ళు ఉన్నారని దేవుళ్ళ పేరుతోటి మతం పేరుతోటి కులాల పేరుతోటి దేశంలో దేశ ప్రజలను విచ్ఛిన్నం చేస్తూ అనైక్యతకు సృష్టిస్తున్నారని విమర్శించారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలైన 55 సంస్థలను ప్రవేట్ పరం చేశాడని దేశ సంపదను అదాని అంబానీలకు దోచిపెడుతున్నాడని అన్నారు. పెట్టుబడిదారుల కోసం ధనవంతుల కోసం దేశ ప్రజలకు సంబంధించిన రైల్వే తో పాటు ఇతర సంస్థలను ప్రైవేటు పరం చేసిన అసలు దేశద్రోహి ఈ బిజెపి ప్రభుత్వమని విమర్శించారు. దీనిని ప్రశ్నించకుండా ప్రజలు చైతన్యవంతం కాకుండా మతం పేరుతో దేవుళ్ల పేరుతో కులాల పేరుతో అనైక్యతను సృష్టించి ఆ మత్తులో ఈ దేశ ప్రజలు మునిగేలా చేస్తున్నాడని వివరించారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఈ భారతదేశం అన్ని కులాలు మతాలు ఉన్న అన్నదమ్ములు ,అక్కచెల్లెళ్ళుగా కలిసి ఉండే చైతన్యవంతమైన దేశమని అన్నారు. బిజెపి నక్కజిత్తుల వేషాలు ఇక్కడ పనిచేయవు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వెంకట్ గౌడ్, మోతిరాం నాయక్ కొత్త నరసింహులు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ముదాం అరుణ్ కుమార్ జిల్లాలోని పార్టీ శాఖా కార్యదర్శులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.