రైతులు దళారులకు వరి ధాన్యం అమ్మి మోసపోవద్దు..!

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 4 (అఖండ భూమి న్యూస్);
రైతులు దళారులకు వరి ధాన్యం అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం సీతారాంపూర్ గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. వరి ధాన్యం సన్న రకం వడ్లు రూ 2389 లు, సాధారణ రకం రూ 2369 లకు క్వింటాల్ కు, అదనపు బోనస్ మరో 500 రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు దళారులను మోసపోవద్దని అన్నారు. ప్రతి రైతు కేంద్రాలకి తరలించి రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో సీతారాంపూర్ లో మొట్టమొదటిసారిగా ఈ ఖరీఫ్ కు కొనుగోలు కేంద్రంలో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


