డియస్సి బయాలజి ఉదయం షిఫ్ట్ లో రాసిన ఉద్యోగులకు అన్యాయం…
అమరావతి ఆగస్టు 14 (అఖండ భూమి న్యూస్) :
ఆంధ్రప్రదేశ్ మెగా డియస్సి – 2025 లో యస్ ఎ బయాలాజి సైన్స్ విభాగంలో ఉదయం షిఫ్ట్ లో పరీక్ష రాసిన అభ్యర్థులము. మా పరీక్ష మధ్యాహ్నం షిఫ్ట్ కంటే కంటే కఠినంగా ఉండి, నార్మలైజషన్ ప్రక్రియలో మాకు సరైన మార్కులు కల్పించబడలేదు.
1. మధ్యాహ్నం షిఫ్ట్ అభ్యర్థులలో చాలామందికి నార్మలైజషన్లో 3–4 మార్కులు అదనంగా ఇవ్వబడ్డాయి.
3. ఉదయం షిఫ్ట్ అభ్యర్థులకు కేవలం 0.1–0.5 మార్కులు మాత్రమే ఇచ్చారు, అంతేకాదు చాలామంది అభ్యర్థుల మార్కులు తగ్గిపోయాయి కూడా.
4. మా షిఫ్ట్ లో కఠినమైన ప్రశ్నలు ఎక్కువగా ఉండి,మధ్యాహ్నం షిఫ్ట్ లో సులభమైన ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి.
5. Key objections కీ ఆబ్జెక్షన్ లో అనేక సరైన అభ్యంతరాలను అంగీకరించకుండా తిరస్కరించారు.
దీని ఫలితం:
మధ్యాహ్నం షిఫ్ట్ అభ్యర్థులలో అధిక శాతం (90%) ఎంపికయ్యే అవకాశం ఉంది.
ఉదయం షిఫ్ట్ అభ్యర్థులు అన్యాయానికి గురవుతున్నారు.
చాలామంది ఉదయం షిఫ్ట్
అభ్యర్థుల మార్కులు తగ్గడం వల్ల ఎంపిక అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
7 సంవత్సరాల కృషి, సమయం, ఖర్చు వృథా అవుతోంది.
మా వినతులు:
1. ఉదయం షిఫ్ట్, మరియు మధ్యాహ్నం షిఫ్ట్
ప్రశ్నాపత్రాల కష్టత స్థాయిని మళ్లీ పరిశీలించి, మార్కుల సవరణ చేయాలి.
2. అన్ని అభ్యర్థులకు సమాన న్యాయం జరిగేలా నార్మలైజేషన్ మళ్లీ చేయాలి.
3. తిరస్కరించిన సరైన కీ అబ్జక్ట్స్ ను పునఃపరిశీలించి మార్కులు కల్పించాలి.
మా సమస్యను పరిగణలోకి తీసుకొని, తక్షణమే న్యాయం చేయమని పత్రిక ముఖంగా కోరుతున్నాము.