నిరుపేదలకు భూ పంపిణీ చేస్తాం – భారత కమ్యూనిస్టు పార్టీ
బెల్లంపల్లి అక్టోబర్ 03అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ మున్సిపల్ 31వ వార్డ్ లో సింగరేణి కి సంబందించిన ఏండ్ల నాటి సౌత్ క్రాస్ మైన్ ఆక్రమణ కు గురి కావడం జరిగింది. ఈ మైన్ చుట్టు ప్రక్కల చాలా ప్రమాదంతో వుందని సింగరేణి అధికారులు గతంలో హెచ్చరికల బోర్డులు పాతినా,కబ్జా కోరులు విచ్చల విడిగా కబ్జా లకు పాల్పడుతున్నారు.గతంలో కూడా ఇదే స్థలంను కబ్జా చేస్తే భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ సమితి 31వ వార్డ్ బస్తీ ప్రజలందరం కలిసి కొట్లాడి సింగరేణి స్థలంను కాపాడడం జరిగింది. కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్థలాన్ని కొంతమంది ఒక కుల సంఘాలకు సంబందించిన వ్యక్తులు కబ్జా చేసి రాత్రికి రాత్రే దేవుళ్ళ విగ్రహాలు ప్రతిష్టించి పెద్ద ఎత్తున కబ్జా చేయాలనీ చూస్తున్నారు. కబ్జాలు చేయాలనీ చుస్తే భారత కమ్యూనిస్టు పార్టీ 31వ వార్డ్ ప్రజలు అన్ని పార్టీల నాయకులు తెరాస కాంగ్రెస్ పార్టీకీ సంబందించిన నాయకులు ముక్త కంఠంతో కొట్లాడి సింగరేణి అధికారుల పై ఒత్తిడి తీసుకు వచ్చి ఆ కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో చెట్లని నాటించడం జరిగింది,అంతే కాకుండా ఆ స్థలంలో సింగరేణి స్థలం అని బోర్డులు పాతించడం జరిగింది,ఈ సందర్బంగా సిపిఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి మాట్లాడుతూ…ఈ స్థలం కబ్జాకి గురి అయితే భారత కమ్యూనిస్టు పార్టీగా చూస్తూ ఊరుకోమని 31వ వార్డ్ లోని ఇల్లు లేని నిరుపేద ప్రజలను గుర్తించి ఈ స్థలంలో ఎర్రజెండాలు పాతి వాళ్లకి ఇల్లు కట్టుకోవడానికి భూములను పంపిణీ చేస్తామని కేసులకు భయపడే ప్రసక్తే లేదని ప్రజల వైపు పోరాటం చేసే సమయంలో ఎలాంటి కేసులు భరించడానికి అయిన కమ్యూనిస్టుగా మేము సిద్ధమని ప్రభుత్వం సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరింస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు రత్నం రాజం, 31 వార్డు సిపిఐ శాఖ కార్యదర్శి గుండా ప్రశాంత్, నాయకులు మహేందర్ రెడ్డి, 31 వార్డు ప్రజలుతదితరులు పాల్గొన్నారు…



