అహింస ,శాంతికి మార్గం మహాత్మా గాంధీ ఆదర్శం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 3 (అఖండ భూమి న్యూస్);
మహాత్మా గాంధీ చూపిన అహింసా, శాంతి మార్గం ద్వారానే సమాజంలో ఉన్న సమస్యలు, విభేదాలు, వత్తిడులను అధిగమించొచ్చని
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.
గురువారం మార్కెట్ యార్డ్ గంజిలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ కేవలం స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాక, అహింసా సిద్ధాంత పితామహుడని, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజల్లో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పడంలో ఆయన చూపిన మార్గం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్ తహసిల్దార్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


