దేశ రక్షణ చేయడంతో పాటు రక్తదానం చేయడం అభినందనీయం..

దేశ రక్షణ చేయడంతో పాటు రక్తదానం చేయడం అభినందనీయం..

 

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 3 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన బాణాల మహేందర్ రెడ్డి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో హెడ్ కానిస్టేబుల్ గా 23 సంవత్సరాలుగా విధులను నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ మానవత్వాన్ని చాటుతున్నాడని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ డాక్టర్ బాలు తెలియజేశారు.

దేశ రక్షణ కోసం ఒకవైపు విధులను నిర్వహిస్తూ,తోటి వారి ప్రాణాలను కాపాడాలనే మంచి ఉద్దేశంతో ఐదవ సారి రక్తదానం చేసినందుకు బాణాల మహేందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.గతంలో ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందని అన్నారు. దేశం కోసం పనిచేస్తూనే మానవత్వాన్ని చాటుతున్నడం అభినందనీయమని అన్నారు.కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీల తరఫున అభినందనలు తెలియజేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!