*న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
రంగారెడ్డి జిల్లా.. అత్తాపూర్ పరిధిలో.. సులేమాన్ నగర్లోని తన ఆఫీసులో ఉన్న ఖదీర్ పై దుండగులు కత్తులతో దాడి చేసారు. పలుమార్లు దారుణంగా పొడవడంతో తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే ఖదీర్ మృతి చెందాడు.. ఇట్టి విషయంపై హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్ మీడియా ముఖంగా మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో న్యాయవాదులకు కనీస భద్రత లేకుండా పొయ్యింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల మీద ఇంత దుర్మార్గంగా హత్యలు జరుగుతున్న పట్టించుకోవట్లేదు. అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. నిన్న కాక మొన్న చేవెళ్ల న్యాయవాది స్వప్న హత్య, గతంలో గట్టు వామనరావు అతని భార్య నాగమణి, రంగారెడ్డి కోర్టు న్యాయవాది ఇజ్రాయిల్ లతో సహా మరెందరో న్యాయవాదులు హత్య చేయబడ్డారు. ప్రతి ఒక్కరి తరుపున న్యాయం కోసం కోట్లాడే న్యాయవాదుల మీద ఇలాంటి హత్యలు జరుగుతుంటే కేంద్ర రాష్ట్ర పభుత్వాలు ఏం చేస్తున్నట్లు ? అంటూ ద్వజమెత్తారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చెయ్యాలి అని ఆయన డిమాండ్ చేశారు.
You may also like
ములగపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్గా కాపారపు శ్రీనివాస్ నియామకం.. సర్వత్రా హర్షం.
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…



