బండ రామేశ్వరపల్లిలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు…

బండ రామేశ్వరపల్లిలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు…

ఘనంగా శివపార్వతుల కళ్యాణం..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 15 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని బండ రామేశ్వరంపల్లి లో మహాశివరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామి స్వయంభు మహాక్షేత్రం లో భక్తులు ఉదయం నుండి అర్ధరాత్రి వరకు భక్తుల శివనామ స్మరణలతో ఉత్సవాలు వేదం బ్రాహ్మణుల మంత్రోత్సరాల మధ్య, తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించారు. ఈ ఆలయముకు చరిత్ర కలిగిన ఆనవాళ్లు ఉన్నాయి. స్వయంభు మహాక్షేత్రం గా వెలసిన ఈ ఆలయంలో పూజలు చేస్తే భక్తులకు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఈ ప్రాంత ప్రజలకు నమ్మకం. ఆలయం కు వచ్చిన భక్తులకు అల్పాహారం, పాలు అందజేశారు. ఈ ఆలయం పురాతనమైన రాతితో చెక్కబడింది. శివరాత్రి మహా పర్వదినాన శివపార్వతుల కళ్యాణం, కోడి నాగుల ను ఆలయం చుట్టూ తిప్పడం ఆనవాయితీగా వస్తుంది. గ్రామంలో రథోత్సవం, 16న జాతర చక్కర తీర్థం, భక్తులకు మధ్యాహ్నం అన్నదానం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాషెట్టి నాగరాజ్, ఆలయ కమిటీ అధ్యక్షులు బా శెట్టి బుజ్జమ్మ నరేందర్, రావులపల్లి కమల శ్రీహరి గుప్తా, అర్చకులు గురుదేవ్ మహేష్, సిద్దయ్య, ఆలయ కమిటీ గ్రామ ప్రజలు భక్త బృందం పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!