ఉర్దూ సాహిత్య ఆధునిక ధోరణులపై సమ్మేళనం…

ఉర్దూ సాహిత్య ఆధునిక ధోరణులపై సమ్మేళనం…

దోమకొండ కోటలో ఉర్దూ సమ్మేళనంకు అపూర్వ స్పందన..

సమ్మేళనంలో పాల్గొన్న రచయితలు..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 14 (అఖండ భూమి న్యూస్);

దక్షిణాదిలో ఉర్దూ ఒక ప్రధానమైన భాషగా చలామణి అవుతూ ఉండేది. కామారెడ్డి జిల్లా దోమకొండ సంస్థానం పూర్వ రాజులు ఉర్దూ సాహిత్య అభివృద్ధికి ఎనలేని కృషి చేసినారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ ట్రస్ట్ 2023 నుండి సంస్థానాలు వారు ఉర్దూ భాష కు అందించిన సేవలను వివరంగా తెలియజేయడం కోసం తెలుగు , ఉర్దూ సాహిత్య సదస్సులనూ నిర్వహిస్తూ రెండు భాషల యొక్క ప్రాముఖ్యతను రాబోయే తరాలకు అందించడం కోసం ప్రయత్నంలో భాగమే ఈ ఉర్దూ సాహిత్య సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరానికి గాను ఆధునిక ఉర్దూ సాహిత్యం తెలంగాణ వారి సేవ దీంట్లో ముఖ్యంగా ఆధునిక కవులు ,వారి రచనలు, వాటి యొక్క ప్రభావం, సమాజం పైన ఎలా ఉందని అంశాలను డాక్టర్ మీర్ అమీర్ హుస్సేన్ విలియం ప్యాటర్స్ అండ్ యూనివర్సిటీ అమెరికా నుండి వచ్చి ప్రసంగించారు. ప్రొఫెసర్ అమ్మిన తహసిన్ 20వ శతాబ్దంలో పద్య గద్య సాహిత్యల యొక్క విలువలను తెలియజేశారు. శ్రీ వినయ్ వర్మ చలనచిత్రం నటుడు ఉర్దూ నాటిక నాటకాలను తెలియజేశారు. తదుపరి డాక్టర్ ముస్తఫా కమల్ , డాక్టర్ అవదేశ్ రాణి బావ 20 శతాబ్దపు దక్కని సాహిత్యం , హాస్య వ్యంగ సాహిత్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కవి సమ్మేళనం , పూర్వ గురు ద్వారా గజల్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కవి సమ్మేళనం లో మంజీరా కాలేజీ ఉర్దూ విభాగం విద్యార్థులు పాల్గొని వారి యొక్క వారి యొక్క కవితలని వేదికపై వర్ణించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గడికోట వారసుడు కామినేని అనిల్, దోమకొండ సర్పంచ్ ఐరేనీ నరసయ్య, పోర్ట్ అండ్ డెవలప్మెంట్ ప్రతినిధి బాబ్జి, నరసింహ రాజు, నేతుల గణేష్ యాదవ్, మనోజ్, విద్యార్థులు, ఆయా గ్రామాల , పట్టణాల ప్రజలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!