అంబర్ పేటలో ఘనంగా సర్పంచ్ జన్మదిన వేడుకలు…
గ్రామస్తుల మధ్యలో సర్పంచ్ అరుట్ల కవిత అనిల్ కేక్ కట్ చేసి..
అంబర్ పేట్ లో అంబరాన్ని అంటిన జన్మదిన సంబరాలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 14 (అఖండ భూమి న్యూస్);
అంబర్ పేట లో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ అరుట్ల కవిత అనిల్ జన్మదిన వేడుకలు శనివారం గ్రామస్తుల మధ్యలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రజలు విశ్వాసంతో గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ గా గెలిపించినందుకు మరోసారి గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. తనదైన శైలిలో గ్రామం, గ్రామస్తుల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేసి గ్రామస్తుల రుణం తీర్చుకుంటారని అన్నారు. పదవి ఉన్నా, లేకున్నా నిరంతరం గ్రామం అభివృద్ధి చేయడం ధ్యేయంగా పనిచేయడం, అవినీతి రహిత గ్రామ అభివృద్ధిని కోరుకుంటున్న అని తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సత్య గౌడ్, వార్డ్ మెంబర్స్ ఫిరంగి అశోక్ ,ఈశ్వర్ గౌడ్, చంద్రారెడ్డి, బిళ్ళకుర్తి. నికిత ,నిమ్మ బాబు ,మనోజ్ ,నీల దేవరాజు , బిజెపి మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ, కారింగుల.నారాయణ , వడ్డే కిష్టయ్య , పులబోయిన శ్రీను ,శ్రీధర్, కారోబర్ కిషన్ రావు, గ్రామపంచాయతీ సిబ్బంది సిద్ధ రాములు, రవి ఎలుక పెళ్లి పెద్దరాజయ్య, మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు.


