కామారెడ్డి మున్సిపల్ కైవసం పై lప్రధాన పార్టీల నజర్..!

కామారెడ్డి మున్సిపల్ కైవసం పై lప్రధాన పార్టీల నజర్..!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 14 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి మున్సిపల్ పై ఎలాగైనా తమ పార్టీల జెండాలు ఎగవేయాలని ప్రధాన పార్టీలు నజర్ పెట్టాయి.

కామారెడ్డి మున్సిపల్ లో మొత్తం 49 కౌన్సిలర్ల గాను కాంగ్రెస్ పార్టీకి 19, బిజెపి పార్టీకి 16,, బీఆర్ఎస్ పార్టీకి 11 స్థానాలు, మూడు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ బంధం స్థానాలతో పాటు విజయం సాధించిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులను తన క్యాంపుకు తరలించినట్లు అత్యంత సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. 49 వార్డులలో మ్యాజిక్ ఫిగర్ 26 స్థానాలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు స్వతంత్రులతో కలిసి 22 స్థానాలకు చేరింది. ఒక ఎంపీ ఓటుతో 23 స్థానాలు కు చేరింది. బిజెపికి 16 స్థానాలు ఉండగా స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి రెండు ఓట్లతో కలిపి మొత్తం 18 స్థానాలకు బలం ఉండగా, టిఆర్ఎస్కు మాత్రం 11 స్థానాలు లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ లేదా బిజెపి పార్టీ మున్సిపల్ కైవసం చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల మద్దతు తప్పనిసరి అయింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దాన కౌన్సిలర్లను హైదరాబాదుకు తరలించగా, బీఆర్ఎస్ హైదరాబాద్ సమీపంలో తరలించినట్లు సమాచారం. బిజెపి 16 మంది కౌన్సిలర్లను మహారాష్ట్రలోని నాగపూర్ కు తరలించినట్లు అత్యంత సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఎవరికి వారే ఆయా పార్టీలు మునిసిపాలు కల్వసం చేసుకుంటామని ధీమాగా ఉండి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మరో ముగ్గురు మరో ముగ్గురు కౌన్సిలర్ ల మద్దతు అవసరం కాగా, బిజెపి పార్టీకి 8 మంది కౌన్సిలర్లు మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 11 మంది కౌన్సిలర్లను మద్దతు కూడా కట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందా? లేదా బయట నుండి బి ఆర్ ఎస్ పార్టీకి రెండు జాతీయ పార్టీలలో మద్దతు ఇస్తుందా? అనే కోణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ పదవి గిరికి ఎవరిని వరిస్తుందో అర్థం కాక ఆయా పార్టీల శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకు ఏ పార్టీకి ఎవరి మద్దతు తెలుపుతారు అనే దానిపై బయటపడే అవకాశాలు ఉన్నాయని ఆయా పార్టీల శ్రేణులు, నాయకులు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!