రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించండి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 4 (అఖండ భూమి న్యూస్);
జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ రాజంపేట మండలంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో శుక్రవారం పాల్గొన్నారు.
ఆరేపల్లి గ్రామంలో రైతులు ప్రవీణ్ , దిలీప్ కుమార్ ల పంట భూములలో భూభారతి రెవిన్యూ సదస్సుల ద్వారా దరఖాస్తుల పరిష్కారానికి రెవిన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న విచారణను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఆయా రైతుల భూవిస్తీర్ణంలో తేడాలను సరి చేసేందుకు సమీప భూముల రైతులను కూడా పిలిపించి చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భూభారతి చట్టంలో ఉన్న ముఖ్యమైన అంశాలలో క్షేత్రస్థాయిలో పరిశీలన అనేది ఒక ముఖ్యమైన అంశమని అన్నారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడే లబ్ధిదారునికి న్యాయం జరుగుతుందని రాజంపేట మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన 1642 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి భూభారతి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక తహసిల్దార్ జానకిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీఓ జ్యోతి పాల్గొన్నారు.
ఇందిరమ్మ గృహాలను నిర్మించుకునేందుకు ముందుగా ఐకెపి ద్వారా నిరుపేద లబ్ధిదారులకు రుణాలను ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సౌకర్యాన్ని లబ్ధిదారులు ఉపయోగించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
తలమడ్ల గ్రామంలో…
రాజంపేట మండలం తలమడ్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని జిల్లా కలెక్టర్ సందర్శించి లబ్ధిదారు బోయిన శ్యామల సుధాకర్ దంపతులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణానికి ఇసుక, మొరం ఎక్కడినుండి తీసుకొస్తున్నారని, ఎంత విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. బేస్మెంట్ వరకు పని పూర్తి ఐనా ఇంకా ఎందుకు తొందరగా పిల్లర్స్, స్లాబ్ వేసుకోవడం లేదని అడిగారు. బేస్మెంట్ వరకు పూర్తయిన పనులకు సోమవారం డబ్బులు ఖాతాలో పడతాయని అన్నారు. వెంటనే పిల్లర్స్, స్లాబ్ పని ప్రారంభించాలని సూచించారు. ఈ గ్రామంలో మంజూరైన అన్ని ఇండ్లకు ముగ్గు పోసి ప్రారంభించడం జరిగిందని అలాగే మండలంలో ముగ్గు పోయకుండా పెండింగ్ లో ఉన్న అన్ని ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి పనులు ప్రారంభించాలని హౌసింగ్ ఏఈ రామును ఆదేశించారు. ఇందిరమ్మ గృహ నిర్మాణాలకొరకు మండలంలో ఇసుక మరియు మొరం సమస్య లేకుండా చూడాలని తాసిల్దార్ జానకి, ఎంపీడీవో రఘురాం లను ఆదేశించారు. బేస్మెంట్ పూర్తయి చాలా రోజులైనా ఇంకా తర్వాత నిర్మాణాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించి ఏమన్నా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణానికి ముందుగా ఐకేపీ ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం రుణ సౌకర్యాన్ని కల్పించినందున ఈ అవకాశాన్ని ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు ఉపయోగించాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో కామారెడ్డి ఆర్డీఓ జ్యోతి, హౌసింగ్ పిడి పాల్గొన్నారు.
ఆరేపల్లి గ్రామంలో…
జిల్లా కలెక్టర్ తలమడ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు మండల ప్రజా పరిషత్ ప్రైమరీ స్కూల్లో ఆకస్మికంగా విజిట్ చేశారు.
ముందుగా జడ్పీహెచ్ఎస్ లోని పదవ తరగతి గదిలో జిల్లా కలెక్టర్ మాట్లాడి వారికి గణిత సమస్యలను పరిష్కరించేందుకు సూచనలు చేశారు. విద్యార్థులతోనే గణిత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. తర్వాత 9వ తరగతి, 7వ తరగతి గదులలో విద్యార్థుల తో ఇంగ్లీష్ రీడింగ్ చేయించారు. ప్రభుత్వం ఉచితంగా యూనిఫామ్స్ ఇస్తున్నందున విద్యార్థులందరూ తప్పనిసరిగా ప్రతిరోజు యూనిఫామ్ వేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థిని ఉట్ల ఉషశ్రీ ఫిజిక్స్ లో చూపిన ప్రతిభకు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సికింద్రాబాద్ రోటరీ క్లబ్ వారు అందజేసిన 30 రీడింగ్ టేబుల్స్ ప్రారంభించారు.
అనంతరం ప్రైమరీ స్కూల్ మరియు జడ్పీ స్కూల్ విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ప్లేటు పట్టి భోజనం వడ్డించుకుని వారితో నేలపై కూర్చుని ఆహారం భుజంచి రుచి చూశారు.
ప్రైమరీ స్కూల్ కిచెన్ షెడ్ సరిగా లేకపోవడంతో 50వేల రూపాయలను మంజూరు చేస్తూ కిషన్ షెడ్ రిపేర్ చేయించుకోవాలని ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ ను ఆదేశించారు.
పాఠశాల పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ పరిశుభ్రంగా ఉంచాలని ఎంపీడీవో రఘురాం, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీవో జ్యోతి, తాసిల్దార్ జానకి, మండల విద్యాధికారి పూర్ణచందర్, జడ్పీహెచ్ఎస్ హెడ్మాస్టర్ బిక్షపతి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.