కుల సంఘాల ప్రతినిధుల నుంచి ఎమ్మెల్యేకు వినతులు

కుల సంఘాల ప్రతినిధుల నుంచి ఎమ్మెల్యేకు వినతులు

•సంఘాల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 5 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రానికి చెందిన వివిధ కుల సంఘాల ప్రతినిధులు శనివారం కామారెడ్డి బీజేపీ శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం, పద్మశాలి సంఘం, గౌడ్ సంఘం, కాసం సంఘం, కోమటి సంఘం, రజక పెద్ద సంఘం, కురేలి పెద్ద సంఘం, మేకల సంఘం, రజక సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, పాశం సంఘం, ముస్లిం సంఘం, శివ మున్నూరు కాపు సంఘం, కాటిపాపల సంఘం, కట్లకుంట్ల సంఘం, మెత్తల వారి సంఘం, మాదిగ సంఘం, నాయిని బ్రాహ్మణ సంఘం, కుమ్మరి సంఘం ప్రతినిధులు తమ సంఘాలకు సంబంధించిన సమస్యలు, సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి అంశాలను వినతిపత్రాల రూపంలో ఎమ్మెల్యేకు సమర్పించారు. సమావేశంలో ప్రతినిధులు మాట్లాడుతూ, తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతులను సమీక్షించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి సంఘానికి అభివృద్ధి సాధనలో సమాన స్థానం ఉంటుందన్న విశ్వాసాన్ని తెలిపారు. ఈ సందర్భంగా కుల సంఘాల సభ్యులు ఎమ్మెల్యే యొక్క సానుకూల స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని వివిధ సామాజిక వర్గాల మధ్య సమన్వయం, సహకారం మరింత బలపడేందుకు ఈ సమావేశం ఉపకరిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!