స్పెషల్ డ్రైవ్ ద్వారా 130 మొబైల్ ఫోన్ ల రికవరీ…

స్పెషల్ డ్రైవ్ ద్వారా 130 మొబైల్ ఫోన్ ల రికవరీ…

కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 5 (అఖండ భూమి న్యూస్);

పోయిన సెల్ ఫోన్లతో పాటు చోరీకి గురైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సి ఈ ఐ ఆర్ ద్వారా తిరిగి తమ యొక్క ఫోన్లను పొందవచ్చని జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న, చోరికి గురైన 130 మొబైల్ ఫోన్లను (సుమారు 17 లక్షలు విలువగల) స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లను బాధితులకు అప్పగించడం జరుగుతుందని అన్నారు. ఈ మొబైల్ రికవరీలో రాష్ట్రంలోని జిల్లాల కమిషనర్ రేట్లు మినహాయిస్తే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ. ఇప్పటివరకు చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఎస్పీ కార్యాలయానికి (870 2686 114) ఫోన్ కు సంబంధించిన వివరాలను చూపించి ఫోన్లను పొందాలని అన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!