18 సంవత్సరాల నిండిన మహిళలను మహిళా సంఘంలో సభ్యత్వం అందించాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 8 (అఖండ భూమి న్యూస్);
ఇందిరామహిళా శక్తిలో భాగంగా కామారెడ్డి మండల సమాఖ్య ప్రత్యేక సమావేశం మంగళవారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ వాన్ హాజరైనారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ. మహిళా శక్తిలో భాగంగా ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళ సంఘం నందు సభ్యత్వం తీసుకోవాలి తీసుకునేలా సిబ్బంది చూసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్యాడి కొనుగోలు కేంద్రాలు ఈసారి బాగా చేశారు. ఇక ముందు కొనుగోలు కేంద్రాలు పెరుగుతాయి ఇంకా బాగా పనిచేయాలని తెలియజేశారు. ముఖ్యంగా బ్యాంకు లింకేజీ టార్గెట్ ను 100% పూర్తి చేయాలని సూచించారు. డ్రోన్ ఏర్పాటు చేసుకొని వ్యవసాయ సంబంధ ఎరువులు, పురుగు మందులు పిచికారు చేసుకోవాలని తెలియజేశారు. జిల్లా సమాఖ్య భవన నిర్మాణం మండల సమాఖ్య వారు పర్యవేక్షించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్, డిఆర్డిఓ సురేందర్, మండల ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్, డిపిఎం ఫైనాన్స్ రాజయ్య, ఎంపీడీవో ఎఫ్సిబా, మండల సమాఖ్య ఏపీఎం మోహిజ్, సీసీలు విశ్వనాథం, అంజాగౌడ్, స్వరూప,సంజీవులు, వివో ఏలు మండల సమాఖ్య పాలకవర్గం అధ్యక్షులు గోదావరి,కార్యదర్శి సరస్వతి, కోశాధికారి పూజా, గ్రామ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
You may also like
-
కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో వీరికి ఆరోగ్యశ్రీ …
-
మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డిని పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
-
దంపతులు ఇరువురికి ప్రశంశ పత్రాలు…
-
అంగన్వాడి, రెసిడెన్షియల్ , సంక్షేమ హాస్టల్ లకు గుడ్ల సరఫరాకు టెండర్…
-
వన క్షేమమే మన క్షేమం – కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…