ఊపిరితిత్తుల మార్పిడి కోసం సకాలంలో ఓ నెగిటివ్ రక్తం అందజేత..
*26 వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన బద్దం నిశాంత్ రెడ్డి..
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 9 (అఖండ భూమి న్యూస్)
హైదరాబాదులోని సికింద్రాబాద్ యశోద వైద్యశాలలో వేలంపాటి త్రివేణి (43) ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ కావలసిన ఓ నెగిటివ్ రక్తం అందుబాటులో లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలుడు సంప్రదించడంతో భిక్కనూరు మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామానికి చెందిన బద్దం నిశాంత్ రెడ్డికి తెలియజేయడంతో వెంటనే కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లి సకాలంలో ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేయడం జరిగిందని డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో 26వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన గడ్డం నిశాంత్ రెడ్డికి ఉప్పల శ్రీనివాస్ గుప్త తరఫున అభినందనలు తెలియజేశారు.సమాజంలో ఎవరికో ఇబ్బంది వస్తే నాకేమిటి అనే భావనను వదిలి పెట్టాల్సిన అవసరం ఉందని,తోటి వారికి సాధ్యమైనంత వరకు సహాయం చేయాల్సిన అవసరం సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉందని అలాంటి గొప్ప ఆదర్శవంతమైన వ్యక్తులలో నిశాంత్ రెడ్డి ఒకరిని వీరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



