దోమకొండ వన మహోత్సవంలో పాల్గొన్న అధికారులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 8 (అఖండ భూమి న్యూస్)
దోమకొండ మండల కేంద్రంలో వన మహోత్సవంలో భాగంగా మండల ప్రత్యేక అధికారి ఎం జ్యోతి, మండల పరిషత్ అధికారి ఎన్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. దోమకొండ లోని బాలికల గురుకుల పాఠశాల తో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఇందులో భాగంగా పరిశుభ్రం గా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, చుట్టూ ప్రాంతం పరిశుభ్రంగా ఉండేవిధంగా అట్టివ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అన్ని గ్రామ పంచాయతీ వివోలతో సమావేశం నిర్వహించి గ్రామాల్లో తీసుకోవాల్సిన పచ్చదనం పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. అనంతరం గురుకుల పాఠశాలలో భోజనాల నాణ్యత పై పరిశీలించి విద్యార్థులతో భోజనాలు చేశారు. ఇందిరా మహిళా శక్తి పనితీరుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మహిళా శక్తి సభ్యులు, ఏపీవో, ఏపీఎం తదితరులు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…