ప్రభుత్వ రంగ బ్యాంకులను, ఇన్సూరెన్స్ కంపెనీలను బలోపేతం చేయాలి
– అధ్యక్ష, కార్యదర్శులు
– కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 9 (అఖండ భూమి న్యూస్);
ప్రభుత్వ రంగ బ్యాంకులను, ఇన్సూరెన్స్ కంపెనీలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఒక రోజు ధర్నా కార్యక్రమం ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయం ( బ్రాంచ్ ) ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు ,కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. భారతీయ జీవిత బీమా సంస్థలో పెరుగుతున్న పదవీ విరమణలకు అనుగుణంగా నూతన ఉద్యోగాలు కల్పించకుండా కాలయాపన చేస్తున్నారని. ఆవేదన వ్యక్తం చేశారు.1996 బ్యాచ్ ద్వారా ఎంపిక కాబడి, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ జాప్యం వలన 2012-2013లో జాయిన్ అయిన ఎంప్లాయీస్ కీ పెన్షన్ మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఇన్సూరెన్స్ రంగంలో జిఎస్టిని పూర్తిగా రద్దు చేయాలని పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నపించిన నేటికీ ఆ కోరికను నెరవేర్చకుండా ప్రజలపై పేన్ను భారాన్ని మోపుతున్న ఈ పాలకులను గద్దెనింపాలనీ డిమాండ్ చేశారు. ఎన్పీఎస్ ని తీసేసి అందరికీ ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఐసీఈయూ కార్మికులకు మద్దతుగా సిఐటియు రాష్ట్ర జిల్లా నాయకులు ,లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ నాయకులు నారాయణరావు, పెన్షనర్ అసోసియేషన్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.